
ప్రమాదవశాత్తు కాలు జారీ కుంటలో పడివ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మండల కేంద్రానికి చెందినమేత్రి సాయిలు (28) ఉదయం ఇంటి నుంచి కాళ్ల కృత్యాలకు సమీపంలో ఉన్న మాల కుంటకు వెళ్లి వస్తుండగా కాలు జారీ నీటి కుంటలో పడ్డాడుఊబిలో చిక్కుకున్న సాయిలుకు ఊపిరాడక పోవడంతో అక్కడే మరణించాడు.మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీశారు.మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.మృతునికిఇద్దరు కూతుర్లు ఉన్నారు. ముత్తుడిభార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామ ఎస్సై కోనారెడ్డి తెలిపారు.