
భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ప్లాంట్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నందనం ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని, గత ఎన్నికలలో చేసినా వాగ్దానాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నందనం మదిరే సింగిరెడ్డిగూడెం లో వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను అని కోరినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో కొండాపురం చంద్రమౌళి, నాగేలి సత్యనారాయణ గౌడ్, మట్ట బాలరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.