నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూఎస్ఏకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నిర్వహించిన ఎస్పీయూఎన్ చర్చావేదికలో ప్రపంచ లీడర్‌గా శ్రీచైతన్య విద్యాసంస్థ ఆవిర్భవించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల నుంచి వంద మందికిపైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. నలుగురు ఫైనల్‌కు అర్హత సాధించారు. వారిలో ఇద్దరు గెలుపొందారు. అందులో ఒకరు శ్రీచైతన్య విద్యార్థి కావడం గమనార్హం. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీచైతన్య స్కూల్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి అని తెలిపారు. గత నెల 10 నుంచి 26 వరకు 16 విడతల్లో చర్చ జరిగిందని వివరించారు.