
నవతెలంగాణ – పెద్దవూర
మాజీ మంత్రి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మాజీ సీ ఎల్ఫీ నేత కుందూరు జానారెడ్డి 78 జన్మదిన వేడుకలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు కర్నాటి నర్సిహ్మారెడ్డి గురువారం పెద్దవూర మండల కేంద్రం లోని నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ గా తరలి రావడం తో కేక్ కట్ చేసి స్వట్లు పంపిణి చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి జనారెడ్డికీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి శంకర్ నాయక్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరరాజు, జిల్లా నాయకులు ఉంగరాల శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి పద్మారెడ్డి, మునిరెడ్డి, ఊరె వెంకన్న,మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సల్ల హనుమంత రెడ్డి, కిలారీ మురళీ కృష్ణ యాదవ్, కర్నాటి,కర్నాటి మధు, కర్నాటి లక్ష్మారెడ్డి జాన్ రెడ్డి,కోట అంజి,నడ్డి లక్షమయ్య పాల్గొన్నారు.