– సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి – ఎండి జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలని ప్రధానమంత్రి పూర్తి బాధిత వహించి రాజీనామా చేయాలని, బాధిత విద్యార్థులను ఆదుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించిన అనంతరం మాట్లాడారు. నీట్ పరీక్ష లీకేజీపై కేంద్రం స్పందించకుండా,ఎవరైతే గ్రేస్ మార్కులు పోందారో వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్ళీ రీ-ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు ప్రక్కదారి పట్టించడమేనని, నీట్ ర్యాంకులు తారుమారు అయ్యి, గందరగోళం ఎర్పడుతుందని తెలిపారు. నీట్ పరీక్షపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని వాటిపై సమాధానం చెప్పే బాధ్యత ప్రధానమంత్రి మీద ఉందని అన్నారు. ఎన్ టి ఎ ఏకపక్షంగా వ్యవరిస్తుందని, పరీక్ష కంటే ముందు రోజు బీహార్ రాష్ట్రంలో పాట్నాలో 13మందిని పేపర్ లీకేజీ విషయంలో అరెస్టు చేశారని, హర్యానాలో కూడా ఒకే సీరియల్ నెంబర్ కల్గిన ఎనిమిది మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రలలో కూడా ఇలాంటి లీకేజీ అంశాలు ముందుకోచ్చాయని, వాటిపై విచారణ జరపకుండా కేవలం గ్రేస్ మార్కులు మాత్రమే రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ పెట్టడం అంటే నీట్ అవకతవకలు ప్రక్కన పెట్టి విస్మరించడం అవుతుంది అని అన్నారు. వెంటనే తిరిగి ఎగ్జామ్ నిర్వహించి, ఎన్.టి.ఎ.ను రద్దు చేసి,విద్యార్ధులకు న్యాయం చేయాలని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు. గతంలో నీట్ పరీక్షలు నిర్వహించుకునే అర్హత రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండేదని దానిని రద్దుచేసి ఒకే దేశం ఒకే పరీక్ష పేరుతో బీజేపీ పేపర్ లీకేజీలు పాల్పడడం దారుణమని వారు అన్నారు. వెంటనే నీట్ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దీనిపై దేశ ప్రధాని నోరు విప్పి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, నాయకులు ఏదునూరి మల్లేష్, బందెల ఎల్లయ్య, కొండ అశోక్, ఓవల్ దాస్ అంజయ్య, బోడ భాగ్య, రాంబాబు, సాహిద్, పాలడుగు రవి,రియాజ్, నితిన్ లు పాల్గొన్నారు.