కల్కి అద్భుతం : అమితాబ్‌ బచ్చన్‌

కల్కి అద్భుతం : అమితాబ్‌ బచ్చన్‌ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఎడి’, నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ నటించారు. వైజయంతీ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్‌ ముంబయిలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో పార్ట్‌ అవ్వడం గ్రేట్‌ హానర్‌. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇందులో ఉన్న విజువల్స్‌ మహా అద్భుతం’ అని తెలిపారు. ‘నాగ్‌ అశ్విన్‌ మా గురువు బాలచందర్‌లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్‌ చేసే నేర్పు నాగ్‌ అశ్విన్‌కి ఉంది. ఇందులో బ్యాడ్‌ మ్యాన్‌గా ప్లే చేస్తా’ అని కమల్‌ హాసన్‌ చెప్పారు. ప్రభాస్‌ మాట్లాడుతూ,’గ్రేటెస్ట్‌ లెజెండ్స్‌తో వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన దత్తు, నాగీకి థ్యాంక్స్‌. దీపికతో నటించడం బ్యూటీఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అని తెలిపారు. ‘కల్కి.. కంప్లీట్‌ న్యూ వరల్డ్‌. డైరెక్టర్‌ నాగీ క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ ఇది. యాక్టర్‌గా, ప్రొఫెషనల్‌గా ఇది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌’ అని దీపికా పదుకొనే చెప్పారు. నిర్మాత అశ్విని దత్‌ మాట్లాడుతూ,’అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపిక సమక్షంలో ఈ ఈవెంట్‌ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గ్రేట్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.