– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి కోదండరాం లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేటు పాఠశాలల్లో ప్రభుత్వ ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు గురువారం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి లేఖ రాశారు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రయివేటు పాఠశాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 అమలు కావడం లేదని టెక్ట్స్ బుక్ ప్రింటర్స్, పబ్లిషర్స్ వెలిబుచ్చుతున్న ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సమీక్షించాలని సూచించారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తమ సొంత పుస్తకాలు అమ్మకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు పాఠశాలలు జీవో నెంబర్ 1 ప్రకారం… ప్రభుత్వ సూచించిన టెక్ట్స్ బుక్స్‌నే ఉపయోగించాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ విషయంపై పాఠశాల విద్య సంచాలకులు ప్రొసీడింగ్ ఇస్తూ, ఈ ఆదేశాలను పాటించని ప్రయివేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించిన ట్టు తెలిపారు. వీటిని బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో పలు ప్రయివేటు పాఠశాలలు తమ సొంత టెస్క్ట్స్ బుక్స్‌కు అధిక ధరలు నిర్ణయించి అమ్ముకుంటు న్నాయని తెలిపారు. ఈ యాజమాన్యాలు కేవలం ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులపై అధికంగా ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన టెక్ట్స్ బుక్స్ సెట్ ధర రూ.900 ఉంటే వాటిని కాకుండా రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ధర ఉన్న తమ సొంత పుస్తకా లు కొనుగోలు చేయాలని యాజమాన్యాలు తల్లిదం డ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని వివరించారు. చట్టవి రుద్ధంగా వ్యవహరిస్తూ దోపిడీ చేస్తున్న ప్రయివేటు యాజమాన్యాలు ప్రభుత్వ, ఎస్సీఈఆర్టీ అధికారాలను లెక్కచేయడం లేదని తెలిపారు. వీరి కారణంగా ప్రభుత్వం చేత అనుమతి పొందిన ప్రింటర్లు, పబ్లిష ర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముద్రిం చిన వాటిలో కేవలం 35 శాతం మాత్రమే అమ్ముకో గలిగారని తెలిపారు. మిగిలిన పుస్తకాలు కూడా అమ్ముకునేందుకు వారికి అనుమతివ్వాలని కోరారు.