‘నీట్‌’పై విచారణ జరిపించాలి

– బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సిద్ధగోని రమేష్‌ గౌడ్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌
నీట్‌లో అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, నీట్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సిద్ధగోని రమేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓవైపు కేంద్రం గ్రేస్‌ మార్కుల గందరగోళం సష్టించగా, మరోవైపు పేపర్‌ లీకేజీతో తమ పిల్లల భవిష్యత్‌ ఏంటని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు నీట్‌ వ్యవహారంపై స్పందించాలని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.