జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది…? : ఏనుగుల రాకేశ్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ ముగిసినప్పటికీ నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవటం శోచనీయమని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్‌-2లో 783 పోస్టులు ఇచ్చిన రేవంత్‌ సర్కార్‌ అంతటితో చేతులు దులుపుకుందని విమర్శించారు. ఆయా పోస్టుల సంఖ్యను రెండు వేలకు, గ్రూప్‌-3 పోస్టుల సంఖ్యను మూడు వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీలో 25 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.