సెల్లెకోర్‌ గాడ్జెట్స్‌ హాంగ్‌కాంగ్‌కు విస్తరణ

సెల్లెకోర్‌ గాడ్జెట్స్‌ హాంగ్‌కాంగ్‌కు విస్తరణహైదరాబాద్‌ : సెల్లెకోర్‌ గాడ్జెట్స్‌ లిమిటెడ్‌ హాంగ్‌కాంగ్‌లో తమ పూర్తి యాజమాన్యంలోని కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా విదేశీ కార్యకలాపాలను విస్తరించినట్లయ్యిందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ గూడ్స్‌ రంగంలోని ఈ సంస్థ సెల్లెకార్‌ గాడ్జెట్స్‌ హెచ్‌కె లిమిటెడ్‌ పేరుతో హాంకాంగ్‌లో తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఈ కొత్త అనుబంధ సంస్థ క్ల్లిష్టమైన పరికరాల సేకరణకు, బలమైన రవాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మద్దతు ఇవ్వనుందని తెలిపింది.