సెల్‌ బే స్టోర్‌లో షావోమి 14సివి ఆవిష్కరణ

సెల్‌ బే స్టోర్‌లో షావోమి 14సివి ఆవిష్కరణహైదరాబాద్‌ : మొబైల్‌ విక్రయ రిటైల్‌ చెయిన్‌ సెల్‌ బేలో షావోమి తన కొత్త షావోమి 14సివిని ఆవిష్కరించారు. గచ్చిబౌలిలోని సెల్‌ బే ఫౌండర్‌ సోమా నాగరాజుతో కలిసి సినీనటీ వర్షిణీ కలిసి ఈ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఎల్లప్పుడూ తమ సంస్థ వినియోగదారులకు సరికొత్త ప్రొడక్ట్స్‌ అందిస్తుందని నాగరాజు పేర్కొన్నారు. దీని ధర రూ.39,999గా ఉందని.. ఫైనాన్స్‌ అప్షన్స్‌ కూడా ఉనాయన్నారు. ఈ కార్యక్రమంలో షావోమి ప్రతినిధులు కునాల్‌ అగర్వాల్‌, మల్లికార్జున రావు, సాజు రత్నం తదితరులు పాల్గొన్నారు.