పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కేంద్రం ని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తో కలిసి చండూరు మండల పిహెచ్సి అధికారులు మండల ఆరోగ్యశాఖ స్టాఫ్ నర్సులు వారి ఆధ్వర్యంలో యోగ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు చేయాలన్నారు. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదగోని నాగార్జున యోగ శిక్షకులుగా వ్యవహరించి యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో సోమ నరసింహ గుప్తా, కాసాల జనార్దన్ రెడ్డి, ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్ , హై స్కూల్ వాకర్స్ ,ఆరోగ్యాభిలాషులు, ఆశా కార్యకర్తలు,కరాటే మాస్టర్ కారింగ్ రవి, టైక్వాండో మాస్టర్ నాగిళ్ల రమేష్, విద్యార్థులు విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.