25న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్.. 

నవతెలంగాణ – చేర్యాల
స్పోర్ట్స్ స్కూల్ లో  4వ తరగతిలో  బాల బాలికల ప్రవేశం  కొరకు ఈ నెల 25 న ఉదయం 9 గంటలకు చేర్యాల మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం పరిధిలో గల క్రికెట్ గ్రౌండ్ లో మండల స్థాయి సెలెక్షన్స్  ఉంటుందని ఎం ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు.స్పోర్ట్స్ స్కూల్ 4 వ తరగతి ప్రవేశాలలో పాల్గొనే విద్యార్థులు సెప్టెంబర్ 1, 2015 నుంచి ఆగస్టు 31,2016 మధ్య జన్మించిన వారు మాత్రమే ప్రవేశాలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ కొరకు తొమ్మిది రకాల అంశాలలో బ్యాటరీ టెస్ట్  జరుగుతుందని 3.3o మీటర్లు ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బోర్డ్ జంప్,800 మీటర్ల రన్,6X10 మీటర్లు షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ తోపాటు  చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుందని తెలిపారు. అన్ని రకాల ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురను,10 మంది బాలికలను ఈ నెల 29 న సిద్ధిపేట జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని జిల్లాస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది బాల బాలికలను జులై నెల 9 న రాష్ట్రస్థాయిలో జరిగే సెలెక్షన్స్ కొరకు పంపడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ కొరకు ఏవైనా సందేహాలు ఉంటే బాలికల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పి.రామేశ్వర్ రెడ్డి  9494876376,9951569191నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.