జెన్కో ఉపరితలంలో కోల్పోతున్న అబాధి భూములను పరిశీలించిన ఆర్డీఓ

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని  కాపురం ఓసిపి బ్లాక్-1 ఉపరితలంలో కోల్పోతున్న అబాధి భూములను భూపాలపల్లి జిల్లా ఆర్డీఓ మంగిలాల్,మండల తహసీల్దార్ రవి కుమార్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీఎస్ జెన్కో సంస్థ భూములకు పరిహారం ఇవ్వాల్సిన నేపథ్యంలో  కాపురం రెవెన్యూ శివారుకు సంబంధించిన 6.31 ఎకరాల అబాధి భూములను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడారు త్వరలోనే 15మంది అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ నరేశ్,సర్వేయర్, జెన్కో అధికారులు, ఏఎమ్మార్ అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు.