
భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ట్రై సైకిల్ లను భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ పంపిణీ చేశారు. వీరవల్లి బస్వాపురం గ్రామాలలో వికలాంగుల కొరకు ఆర్టిఫిషల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఇండియా వారి సౌజన్యంతో భువనగిరి ఎంపీపీ సహకారంతో వికలాంగులకు ఆటోమేటిక్ వెహికల్స్, ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస్ , ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు రేగు శ్రీశైలం, ఉపాధ్యక్షులు సర్దార్ శీను, చిన్నం శివ, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంతోష్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మానస, గ్రామస్తులు పాల్గొన్నారు.