మాయా సుందరి..

మాయా సుందరి..చేతన్‌ కష్ణ, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ సక్సెస్‌ ఫుల్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ పాట ఛాట్‌ బస్టర్‌ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘మాయా సుందరి..’ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా, గోపీ సుందర్‌ మంచి బీట్‌తో కంపోజ్‌ చేశారు. అనురాగ్‌ కులకర్ణి పాడారు. ‘మాయా సుందరి..హే మాయా సుందరి..నా మాయా సుందరి..ఎక్కడున్నావో మరి..గుప్పెడు గుండెను నువ్వే పట్టుకు పోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగుతుందీ పాట. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పథ్వీరాజ్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, నవీన్‌ నేని, గిరిధర్‌, భద్రమ్‌ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.