జెకె టైర్‌ నుంచి నూతన శ్రేణీ టైర్లు

 జెకె టైర్‌ నుంచి నూతన శ్రేణీ టైర్లు– అర్‌అండ్‌డిపై రూ.125 కోట్ల పెట్టుబడి :
– అనుజ్‌ కతూరియా వెల్లడి
హైదరాబాద్‌ : జెకె టైర్‌ కొత్తగా ట్రక్కులు, బస్సులు, ఇవిల కోసం నూతన శ్రేణి టైర్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇవి 10 శాతం అదనపు మన్నిక, సామర్థ్యం కలిగి ఉంటాయని వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జెకె టైర్‌ అండ్‌ ఇండిస్టీస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనుజ్‌ కతూరియా ఐదు రకాల కొత్త టైర్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెట్‌వే జెయుఎం ఎక్స్‌ఎం, జెట్‌వే జెయుసి ఎక్స్‌ఎం, జెట్‌ స్టీల్‌ జెడిసి ఎక్స్‌డి సహా విద్యుత్‌ బస్సుల కోసం ప్రత్యేకంగా జెట్‌వే జెయుఎక్స్‌ఇ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాణిజ్య వాహనాల కోసం తమ పోర్టుపోలియోలో 500 పైగా రకాల టైర్లను ఉత్పత్తిని కలిగి ఉన్నామన్నారు. మైసూర్‌లో రూ.600 కోట్లతో ఆర్‌అండ్‌డి సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఏడాది పరిశోధన, అభివృద్థిపై రూ.125 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. దేశంలో ప్రతీ నెల 1.10 కోట్ల యూనిట్ల టైర్లు తయారవుతున్నాయన్నారు. ఈ రంగం వచ్చే ఐదేళ్లలో 6-7 శాతం పెరగొచ్చన్నారు. ప్రస్తుతం దేశంలో 8500 విద్యుత్‌ బస్సులు ఉన్నాయన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 1.6 లక్షల యూనిట్లకు చేరొచ్చని.. ఈ రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు.