తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు అవుట్‌లెట్లు

య్– డక్కన్‌ చాయ్ సిఇఒ వెల్లడి
హైదరాబాద్‌ : వచ్చే ఏడాది మార్చి కల్లా తెలుగు రాష్ట్రాల్లో దక్కన్‌ చారు అవుట్‌లెట్లను రెట్టింపు చేస్తామని శ్రేయాస్‌ గ్రూపు ఛైర్మన్‌ జి శ్రీనివాస్‌ రావు, దక్కన్‌ చారు సిఇఒ జి వీరన్న తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు 220 దక్కన్‌ చారు అవుట్‌లెట్‌లు ఉన్నాయని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు సహా ఒడిస్సా, కర్నాటకలో తమ కార్యకలాపాలు ఉన్నాయని.. త్వరలోనే మహారాష్ట్ర, తమిళనాడుకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 1000 ఫ్రాంచైజీ స్టోర్లకు విస్తరించాలనేది తమ ప్రధాన లక్ష్యమన్నారు. దీంతో 2000 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.6.5 లక్షల వ్యయం అవుతుందన్నారు.