రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

– తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని దామెరవాయి గ్రామంలో రేపు ఆదివారం జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని ఎక్కువమంది యువత రక్తాన్ని దానం చేసి విజయవంతం చేయాలని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల యువత ముందుకు రావాలని తెలిపారు. ప్రమాదాలు గాయపడిన వారికి అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్త దానం మరొకరికి ప్రాణదానం అని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమం నిర్వహించబడుతుందని యువకులు, సామాజిక కార్యకర్తలు, రక్తదాతలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలు కావాలని వారు పిలుపునిచ్చారు.