తెలంగాణ యూనివర్సిటీ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి దోసారప్ విజయకుమార్ కు డాక్టర్ వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో ” డిజైన్ అఫ్ హైలీ ఎఫిషియంట్ హేతేరోజెనెస్ కాటలీస్ట్స్ ఫర్ ద సెలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ బయోమాస్ దేరివేడ్ ప్లాట్ ఫామ్ మోలేకల్స్ టు వాల్యూ అడేడ్ ప్రొడక్ట్స్ ఈ” అనే అంశంపై పరిశోధన జరిపారు. శనివారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినల్ డాక్టర్ వేణుగోపాల్ చీప్ సైంటిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. పరిశోధకులు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చారు.ఈ పరిశోధన సమాజంలోని జీవపదార్థం / బయోమస్ నుండి మనకి అవసరమైన రసాయాలను, ఇంధనాలను తయారు చేసుకోవుటనికి ఎంతగానో పాటుపడుతుందని తెలిపారు. దోసారపు విజయ్ కుమార్ అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ప్రొఫెసర్లు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీ ప్రధానానికి ఆమోదం తెలిపారు.ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఫార్మసిటికల్ కెమిస్ట్రీ అధిపతి డాక్టర్ వాసన్ చంద్రశేఖర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ డాక్టర్ ఎం అరుణ, డాక్టర్ బోయపాటి శిరీష, కాంటాక్ట్ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.