మండలంలోని గిద్ద ఉన్నంత పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పాటల పోటీ, ఖో ఖో ఆటలను నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కన్నయ్య మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతో పాటు పాటలు, ఆటలు ఉపయోగపడతాయని, అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూమేష్, విష్ణు, కాసిం, కైలాస్, స్వప్న ప్రియ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, మహేష్, రాజేశ్వర్, సి ఆర్ పి మహమ్మద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.