కొండ నెక్కిన టమాట ధర 

– కొనుక్కుంటే కూర వంటకు ఇబ్బంది 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలో టమాటా ధర శనివారం కొండన్నకి కూర్చుంది. కొనుక్కోకుంటే కూర వంటకు ఇబ్బంది ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాట ధర 80 రూపాయలు గతవారం చూసుకుంటే టమాటా కిలో ధర 45 నుంచి 50 రూపాయలు పలికితే శనివారం కిలో 80 రూపాయలు పలకడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కావున నిత్యవసరాల తో పాటు కూరగాయల ధరలు కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని  కోరుచున్నారు.