ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేయండి..

నవతెలంగాణ -తాడ్వాయి 
ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో ఎన్ఐటి సీటు సాధించిన ఊరట్టం  గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు (జంపంగవాయి) గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి అనుముల శ్రీకాంత్ కు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గ్రామస్తులు, కొన్ని స్వచ్ఛంద సంఘాలు, స్థానిక పార్టీల నాయకులు ఆర్థిక సహాయం చేశారు కానీ అవి ఫీజు కట్టడానికి సరిపోవడం లేదని బాధపడుతున్నట్లు తెలిపారు. తండ్రిని కోల్పోయి కష్టపడి కూలినాలి, హమాలీ పని చేసుకొని ఉన్నత చదువులు చదువుతున్న అనుముల శ్రీకాంత్ ఇంకా దాతలు ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నారు. చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో పేద విద్యార్థి అయినా శ్రీకాంత చదువు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందని అలాంటి ఆటంకం కలగకుండా దాతలు సహకరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సహాయం చేసే దాతలు 89850 56970 ఫోన్ పే కు ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నారు.