సొంత గూటి లో చేరిక 

నవతెలంగాణ – ఆత్మకూర్ (ఎస్)
మండలంలోని ఏపూరు గ్రామానికి చెందిన మాజీ శాఖ కార్యదర్శి నవిల రవి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. శనివారం సీపీఐ ఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య సమక్షం లో మాతృ సంస్థలో చేరారు. ఈ సందర్భంగా అవిరే అప్పయ్య మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని భవిష్యత్తు కూడా కమ్యూనిస్టు లదేనని అన్నారు. గతంలో సిపిఎం పార్టీలో పనిచేసి ఇతర పార్టీలలోకి వెళ్లిన మాజీ కామ్రేడ్స్ మాతృ సంస్థలోకి రావాలని పిలుపునిచ్చారు. నవిల రవి మాట్లాడుతూ తాను మాతృ సంస్థలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు తొండల నారాయణ , నూకల గిరి ప్రసాద్ రెడ్డి పార్టీ మండల కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్ ,వరికుప్పల మహేష్ ,జానీ మియా తదితరులు పాల్గొన్నారు.