మన వంటింట్లో ఎప్పుడూ అందుబాట్లో ఉండే లవంగాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. రోజుకి రెండు లవంగాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
లవంగాలలో విటమిన్ బి1, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ కె, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అలాగే సోడియం, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. జలుబు, దగ్గు, ముక్కు కారటం వంటి సీజనల్ సమస్యలతో బాధపడుతున్న వారు లవంగాలు తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలనూ దూరం చేసుకోవచ్చు.