పేదవారికి అందుబాటులో విద్యనందిస్తున్న శ్రీనివాస రామానుజన్ స్కూల్…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ ని ఆదర్శం గా తీసుకొని గణితం,  సైన్స్ సబ్జెక్టు లలో పునాదులు లేని భువనగిరి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత విద్యార్థులకి గట్టి పునాదులు వేసి వారి అభివృద్ధి కి చేయూతనిచ్చి వారి తల్లిదండ్రులు కన్న కళలని నిజం చేయాలనే ఉన్నత లక్ష్యం తో నెలకొల్పబడిన మా పాఠశాల శ్రీనివాస రామానుజన్ హై స్కూల్. నెలకొల్పిన మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం రామానుజన్ గారి పుట్టినరోజున జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం కరాటే కుంఫు లాంటి శిక్షణ కార్యక్రమాలను కూడా పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తుంది. మా ఎస్ ఆర్  విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రతిభ పరీక్షలలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. మా పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల విశాలమైన క్రీడామైదానం,  స్విమ్మింగ్ పూల్ త్రాగడానికి ఫిల్టర్ వాటర్, కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మాథ్స్ ల్యాబ్,  విశాలమైన లైబ్రరీ వంటి వసతులు కల్పించాలని ఇటువంటి ఉన్నత లక్ష్యంతో త్వరలో రెండు ఎకరాల విస్తీర్ణంలో అన్ని హాంగులతో విశాల పైన క్రీడా మైదానంతో నూతన భవనాన్ని ప్రారంభించబోతున్నాం .సుశీక్తులైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ విద్యను అతి తక్కువ ఫీజులతో బోనగిరి ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో నెలకొల్పబడినటువంటి మా పాఠశాలలో అన్ని విధాలుగా ఆదరించి విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస రామానుజన్ స్కూల్ యాజమాన్యం కోరుకుంటున్నట్లు ప్రిన్సిపల్ శ్రీరాములు తెలిపారు.