స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం 

నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న1992-93 పదవ తరగతి స్నేహితుడు  రుద్రారం రమేష్ ఇటీవల మృతి చెందగా స్నేహితుని కుటుంబానికి తోటి మిత్రులు రూ. 20 వేలను అందజేశారు. పదవ తరగతి మిత్రులకు ఎలాంటి ఆపద కలిగిన అందరం కలిసి అండగా నిలుస్తున్నామని  స్నేహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొద్దుల శంకర్, పున్న అశోక్, వరియేగుల అనంతస్వామి, బొల్లంపల్లి రవిందర్, ఎగ్గోజు సుదర్శనాచారి పాల్గొన్నారు.