– కిసాన్ ఖెత్ మండల అధ్యక్షులు గంగాధర్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకన్ని కిసాన్ ఖెత్ మండల అధ్యక్షులు ఎల్ఐసి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించి పటాకులు కాల్చి, సీట్లు పంచారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఎల్ఐసి గంగాధర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో మాజీ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, లో ఆదేశాల మేరకు టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ పైగా ముడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశమై రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని అ మోదం కావడంతో ఇందల్ వాయి మండల రైతుల పక్షాన వారికి రుణపడి ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి చుపుతుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సమయంలో రైతులకు ఏకకాలంలో లక్షా రుణమాఫీ చేశామన్నారు. పదేళ్ల బిఅర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూడుకు పోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటికి ఖజానా మొత్తం ఖాళీగా ఉన్న రైకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉచుకొని లక్షలాది రైతులకు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదన్నారు. గతంలో బిఅర్ఎస్ పార్టీ రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల మాఫీ చేయలేదని కొందరికి మాఫీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారంటీల హామీ లను ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడం పట్ల రైతులే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం హర్షం ప్రకటిస్తున్న రాని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూర్ నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, డిసిసి డెలిగేట్ సుధాకర్,మాజీ మండల అధ్యక్షుడు గుట్ట గంగాధర్, డాక్టర్ రాజేశ్, సోసైటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మండల ట్రెజరర్ కుంట గంగారెడ్డి, బోర్ వేల్ రాజేందర్ రెడ్డి,ఎన్ఎస్యుఐ రూరల్ అద్యక్షులు ఆశిష్, రతన్, హబిబ్, సద్దాం, మాజీ ఉప సర్పంచ్లు బైరయ్య, నవీన్ గౌడ్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, నరేష్, ఇర్ల సాయందర్, ఎరుకల ప్రసాద్, రత్తునాయక్, అంబర్ సింగ్ రైతు నాయకులు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.