ప్రతి ఏడాది మాదిరిగానే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పేరిట ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రంగంలో అన్ని విభాగాలల్లో మంచి ప్రతిభని చూపిన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను బహూకరించ నున్నారు. ఈనెల 29న హైదరా బాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఈ వేడుకను సినీ, రాజకీయ ప్రముఖులతో సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపనున్నారు. ఇందులో భాగంగా ఈ వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) విచ్చేస్తున్నారు. కళావేదిక (ఆర్.వి. రమణ మూర్తి), రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబోయే ఈ వేడుకకు విశిష్ట అతిథిగా వచ్చేం దుకు అంగీకరించినందుకు మంత్రి సీతక్కకు కతజ్ఞతలు తెలియ జేస్తున్నామని, ఈ వేడుకలో ఎన్టీఆర్ అభిమానులతోపాటు ప్రేక్షకులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం అని కళావేదిక నిర్వాహకులు పేర్కొన్నారు.