నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జానపద కళాకారుడు రామచంద్రయ్య మృతి పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవంపోసి… గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సాకిని రామచంద్రయ్య మరణం జానపద కళకు తీరని లోటని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.