నవతెలంగాణ- రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన సింగు గంగ నర్సయ్య (62) బాలికకు మాయమాటలు చెప్పి అతని టైలర్ షాప్‌లోకి తీసుకెళ్లి దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నర్సయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ దేవేందర్ తెలిపారు.