బీజేపీ కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్థంతి

– మొక్కలు నాటిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్థంతి సందర్భంగా బలిదాన్‌ దివస్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంట్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్‌ తివారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం ఆవరణంలో వారు మొక్కలు నాటారు. నివాళులర్పించిన వారిలో బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, జి.ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్‌ విజయరామారావు, ఎండల లక్ష్మీనారాయణ, తదితరులున్నారు.