బైకు, కారు ఢీ కొని వ్యక్తి మృతి

– మృతి చెందిన వారు ముదివేను గ్రామ మాజీ సర్పంచ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు
నవతెలంగాణ-కందుకూరు
బైకును కారు ఢకొీనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మతిచెందిన సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండలం ముదివేను గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ ఈర్లపల్లి యాదయ్య (45) సోమవారం హైదరాబాదులో ఓ కళాశాల వద్దకు వెళ్లి సంధ్య అనే అమ్మాయికి టీసీ తీసుకొని తిరుగు ప్రయాణంలో తన సొంతూరు ముధువేను గ్రామానికి వెళ్తున్నారు. సాయంత్రం, శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ ప్రధాన రహదారి దెబ్బ డగూడ గేటు సమీపంలో హైదరాబాదు నుండి అతి వేగంగా వస్తున్న షిఫ్ట్‌ డిజైర్‌ కారు, యాదయ్య వెళుతున్న బైకును ఢకొీట్టింది. బైక్‌ పైనున్న యాదయ్య, బైకుపై నుండి ఎగిరిపడి అక్కడికక్కడే మతి చెందగా, బైకుపై వెనకాల కూర్చున్న విద్యార్థి సంధ్య (17) తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యాదయ్య ముదివేను గ్రామ మాజీ సర్పంచిగా 2009 సంవత్సరంలో పని చేశారు. యాదయ్య మతదేహం పోస్టుమాస్టర్‌ నిమిత్తం ఉస్మాని యా ఆస్పత్రి తరలించారు. సంధ్యకు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.