హెచ్‌సీఏ ఓపెన్‌ సెలక్షన్స్‌

– ఉమెన్స్‌ లీగ్‌ కోసం ప్రతిభాన్వేషణ
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఉమెన్స్‌ లీగ్‌ కోసం వర్థమాన మహిళా క్రికెటర్లను ఎంపిక చేసేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఓపెన్‌ సెలక్షన్స్‌ నిర్వహించనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్‌. దేవరాజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29, 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప్పల్‌ స్టేడియంలో సెలక్షన్స్‌ చేపట్టనున్నారు. ఆసక్తిగల క్రికెటర్లు హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి సూచించారు. గతంలో బీసీసీఐ, హెచ్‌సీఏ టోర్నమెంట్స్‌లో పోటీపడని క్రికెటర్లు మాత్రమే ఓపెన్‌ సెలక్షన్‌కు హాజరు కావాలని దేవరాజ్‌ తెలిపారు.