ఒలింపిక్స్‌కు ఆర్చరీ జట్లు

ఒలింపిక్స్‌కు ఆర్చరీ జట్లు– మెన్స్‌, ఉమెన్స్‌ జట్లు అర్హత
న్యూఢిల్లీ : 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ మెన్స్‌, ఉమెన్స్‌ జట్లు అర్హత సాధించాయి. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ ఐదు పతక విభాగాల్లో (మెన్‌, ఉమెన్‌ టీమ్‌, వ్యక్తిగత సహా మిక్స్‌డ్‌ టీమ్‌) పోటీపడనుంది. నాన్‌ క్వాలిఫయింగ్‌ జట్ల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలువగా.. మెన్స్‌లో చైనా, ఉమెన్స్‌లో ఇండోనేషియా రెండో స్థానంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. 40 ఏండ్ల ఆర్మీ వెటరన్‌ తరుణ్‌దీప్‌ రారు, మాజీ వరల్డ్‌ నం.1 దీపిక కుమారి నాల్గోసారి ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. ఒలింపిక్స్‌కు భారత జట్లు : తరుణ్‌దీప్‌ రారు, ధీరజ్‌ బొమ్మదేవర, ప్రవీణ్‌ జాదవ్‌ (మెన్స్‌). దీపిక కుమారి, భాజన్‌ కౌర్‌, అంకిత (ఉమెన్స్‌)