హీరో మోటో వాహనాలు ప్రియం

హీరో మోటో వాహనాలు ప్రియంన్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్‌ తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోటారు సైకిళ్లు, స్కూటర్లపై జులై 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని సోమవారం ఆ సంస్థ వెల్లడించింది. మోటారు సైకిల్‌ లేదా స్కూటర్‌పై గరిష్టంగా రూ.1,500 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ముడి సరుకుల వ్యయాలు పెరగడంతో పెంపు అనివార్యమయ్యిందని హీరో మోటో తెలిపింది. హీరో మోటో 2023లో 5.08 లక్షల యూనిట్లు అమ్మకాలు చేయగా.. 18,673 యూనిట్లను ఎగుమతి చేసింది.