నవతెలంగాణ – గురుగ్రామ్: శామ్సగ్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S22 పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని ఫైనాన్సింగ్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు కేవలం INR 2709/నెలకి చెల్లించి శామ్సంగ్ ఫ్లాగ్షిప్ అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ధర INR 7299 కాగా, Galaxy S22 ఇప్పుడు INR 64999 ఆకర్షణీయమైన ధరతో సొంతం చేసుకోవచ్చు. కానీ అంతే కాదు! వినియోగదారులు INR 7000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా, Galaxy S22 ధరను మరింత తగ్గించుకోవచ్చు మరియు INR 57999తో శామ్సంగ్ ఫ్లాగ్షిప్ పరికరాన్ని సొంతం చేసుకోవచ్చు. మెరుగైన స్థోమత కోసం చూస్తున్న వినియోగదారులు హెచ్డీఎఫ్సీ సీడీ ద్వారా లేదా బజాజ్ ఫిన్సర్వ్తో సౌకర్యవంతంగా INR 2709/ నెలకు చెల్లించి 24-నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికను పొందవచ్చు. త్యామ్నాయంగా, అప్గ్రేడర్లు INR 7000 అప్‌గ్రేడ్ బోనస్ మరియు INR 3000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను పొందిన తర్వాత INR 54999లో నమ్మశక్యం కాని ధరతో Galaxy S22ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌తో, వినియోగదారులు ఏ బ్యాంక్‌లో అయినా 9 నెలల నో-కాస్ట్ ఇఎంఐని కూడా ఎంచుకోవచ్చు.
బోల్డ్, స్థిరమైన కాన్షియబుల్ డిజైన్‌తో తయారు చేసిన Galaxy S22 ప్రతి క్షణాన్ని అద్భుతంగా మార్చుంకు అధునాతన ఇంటెలిజెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో డైనమిక్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే, Galaxy S22లోని నైటోగ్రఫీ ఫీచర్ కొత్త కెమెరా ఎన్హ్యాన్స్మెంట్ను అందిస్తుంది. ఇది మీరు పగలు లేదా రాత్రి సమయంలో రికార్డ్ చేసినా, ముందు మరియు వెనుక కెమెరాలలో స్ఫుటమైన, స్పష్టమైన వీడియోలను స్నాప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే, 23% పెద్ద సెన్సార్ మరియు అడాప్టివ్ పిక్సెల్ టెక్నాలజీతో, Galaxy S22 తక్కువ కాంతిలో కూడా శక్తివంతమైన డిటెయిల్స్‌ను మరియు వర్ణాలను సంగ్రహిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పోర్ట్రెయిట్ మోడ్ మరియు ఆటో ఫ్రేమింగ్ వంటి ఏఐ-మద్దతు కలిగిన ఫీచర్లను కలిగి ఉండడంతో ఇది అన్ని ఫోటోలు & వీడియోలను ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేస్తుంది. 4nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేసే Galaxy S22 శామ్సంగ్ అధునాతన కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. అసమానమైన పనితీరు కోసం Galaxy S22 వై-ఫై 6Eని కూడా కలిగి ఉంది. దీని ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ నీటి చుక్కలకు వ్యతిరేకంగా మన్నికను అందిస్తాయి. వినియోగదారులు Galaxy S22 నుంచి నాలుగు తరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లను పొందుతారు. శామ్సంగ్ Galaxy S22 శక్తివంతమైన నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా సురక్షితం చేయబడింది. ఇందులో సురక్షిత ప్రాసెసర్ మరియు మెమరీ మీ పాస్వర్డ్లు, బయోమెట్రిక్స్ లేదా ఫోన్ ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి బ్లాక్ చెయిన్ కీల వంటి సున్నితమైన డేటాను పూర్తిగా వేరుచేసే మెమరీని కలిగి ఉంటుంది.