– బాధ్యతలు అప్పజెప్పిన భూపాలపల్లి డిసిఓ శైలజ
నవతెలంగాణ మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము తాత్కాలిక చైర్మన్ గా ఇప్ప మొండయ్య కు బాధ్యతలు అప్పజెప్పినట్లుగా భూపాలపల్లి డిసిఓ శైలజా తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మొన్నటి వరకు చైర్మన్ గా ఉన్న చెప్యాల రామారావుసై ఈనెల 21న డిపాల్టర్ కింద అనర్హత వేటు వేయగా,వ్యక్తిగత కారణాలతో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు ఈనెల 13న వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు.
ఎంసీ సమావేశానికి హాజరైన మెజార్టీ సభ్యులు మొండయ్య ను ప్రపోజల్ చేయడంతో ఆయనకు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా తెలిపారు.సొసైటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా ముగ్గురు దీపాల్టర్ కాగా ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు.మిగిలిన 9 మందిలో మెజార్టీ 5 గురు డైరెక్టర్లు హాజరైయ్యారన్నారు. 9 మంది సభ్యుల ఫొటోతో కూడిన గుర్తింపునకు సహకార సంఘం హైదరాబాద్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పంపి వారి నిర్ణయం మేరకు చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక చేయునట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్కా ప్రకాష్ రావు, వోన్న తిరుపతి రావు, సంగ్గేం రమేష్, సర్వా నాయక్, సిఈఓ సంతోష్, పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.