సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ గాంధారి: గాంధారి మండల కేంద్రంలోని మజీద్ లో స్థానిక ఎంపీటీసీ తూర్పు రాజులు ఎంపిటిసి నిధులు నుండి సుమారుగా 2 లక్షల రూపాయలతో మసిద్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ రాధ బలరాం,జెడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధా బలరామ్, ఎంపిటిసి తూర్పు రాజులు స్థానిక నాయకులతో కలసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపిటిసి తూర్పు రాజులు మాట్లాడుతూ గాంధారిలో ప్రధానంగా 2 కిలోమీటర్ల రోడ్డు మరియు సంగెం రేవు బ్రిడ్జి, పోచమ్మ గుడి రోడ్డు పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆశీస్సులతో అతి తొందరలో ప్రారంభించుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చెర్మెన్ సాయికుమార్, తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, ఎంపిటిసి పత్తి శ్రీనివాస్, నాయకులు తాడ్వాయి సంతోష్, బెజగం సంతోష్, లైన్ రమేష్, ముస్తప్ప, సంగని బాబా, నీల రవి, గడ శంకర్, బొమ్మని బాలయ్య, బాగ్యా నాయక్, వినయ్, విఠల్, బషీర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజిద్ కమిటి మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు