రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే జారే

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏకకాలం రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అయ్యారని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు.
నియోజక వర్గం అయిన అశ్వారావుపేట లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి ఆయన పాలాభిషేకం చేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ రాంబాబు,మొగళ్ళపు చెన్నకేశవ రావు,జూపల్లి రమేష్,ప్రమోద్,బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.