రంగయ్య డాక్టర్ మరణం బాధాకరం..

– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ లో అనాటి కాలంలో సుదీర్ఘ కాలంగా ఆర్.ఎం.పి డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ రంగయ్య మరణం చాలా బాధాకరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే  చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో రంగయ్య డాక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగయ్య డాక్టర్ మరణించడం తననేంతగానొ కలిచి వేసిందని  చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో  గడిపె మల్లేశ్, అయిలేని సంజీవరెడ్డి ఎగ్గోజు సుదర్శన్ చారి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, గూడ పద్మ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.