ఎస్సీ హాస్టల్లో భోజనం తనిఖీ..

నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్లో మంగళవారం రోజు ఉదయం జెడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి భోజనాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా భోజనం రుచికరంగా వండుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టించాలని హాస్టల్ వార్డెన్ రామును ఆదేశించారు.