– ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
– అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఎల్‌ఓసీ పత్రాలు అందజేత
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదు కుంటున్నదని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ము ఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండాపూర్ డివిజన్ పరిధి లోని మార్తాండ్ నగర్‌కు చెందిన కళావతికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖా స్తు చేసుకొనగా సీఏంఆర్‌ఎఫ్ కింద ఎల్‌ఓసీ ద్వారా మం జూరైన రూ.2 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గాం ధీ తెలిపారు. అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘా టించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవ లను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యానికి గురై ఆర్థికస్థోమత లేక ఆస్పత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా..సీఎం సహాయనిధి ఆర్థిక భరోసానిస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకు సహకారం అందించిన గాంధీకి కృతజ్ఞతలను బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ నాయకులు కావూరి అనిల్, సాంబయ్య, షేక్ జమీర్, అక్కరావు, తదితరులు పాల్గొన్నారు.