‘కంటివెలుగు’ వాహనాలు నడిపిన వారికి కిరాయి డబ్బులు చెల్లించాలి

– వాహనాల యజమానులు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-కందుకూరు
గత ప్రభుత్వ హయాంలో కంటి వెలుగు కార్యక్రమా నికి, సిబ్బందిని, డాక్టర్లను, పేషెంట్లు తీసుకు వెళ్లడానికి ఆటోలు ఉపయోగించారని ఇంతవరకు తమకు డబ్బులు చెల్లించలేదని కంటి వెలుగు ప్రోగ్రాం వాహనాల యజ మానులు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యా లయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల ఉదరు, జంగయ్య, శ్రీధర్‌, కిషన్‌, నరసింహ, ప్రభా కర్‌ మాట్లాడుతూ..ఒక్కొక్క ఆటో వారికి సుమారుగా రూ.30 వేలు, నుండి, 40 వేలు, లక్షల వరకు ఆటోల కిరాయి చెల్లించవలసి ఉన్న ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. అందుకే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వైద్య కా ర్యాలయంలో అధికారులు తమకేమీ పట్టనట్లు ఉన్నారని, సంవత్సరం నుండి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభు త్వంలో తమకు న్యాయం చేయాలని కోరారు.