సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ’35- చిన్న కథ కాదు’. సురేష్‌ప్రొడక్షన్స్‌తోపాటు ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రైటర్, డైరెక్టర్. మంగళవారం మేకర్స్ ప్లజెంట్‌గా డిజైన్ చేసిన పోస్టర్ ద్వారా టైటిల్‌ని రివీల్ చేశారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ‘పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర’ తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్: టి సి ప్రసన్న, డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్.