జాతీయ అవార్డు అందుకున్న లక్ష్మణ్‌దాస్‌

నవతెలంగాణ-కాసిపేట
మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ నాయకులు, సామాజిక కార్యకర్త, స్వేరోస్‌ రాష్ట్ర నాయకులు, సింగరేణి ఉద్యోగి బన్న లక్ష్మన్‌దాస్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అంబేద్కర్‌ జాతీయ అవార్డును బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ బన్న లక్ష్మన్‌దాస్‌ పని చేసిన ప్రతి పని లో ఫలితం తీసుకురావడంలో నేర్పరి అని, ఏ సంస్థలో చేసిన ప్రజలకు దగ్గరగా ఉండి కష్టపడి చేయగలరని, అంబేద్కర్‌ నేషనల్‌ అవార్డు తెలంగాణ నుంచి తీసుకోవడం అభినందనీయమన్నారు. 2002లో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి, వైద్య ఆరోగ్య, పర్యావరణ అంశాలపై కృషి చేయడం గొప్పదని వారు అన్నారు. స్వేరోస్‌ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, కవి, గాయకులు, రచయిత దరువు ఎల్లన్న, కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ కన్వీనర్‌ దుర్గం భాస్కర్‌, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్‌, మాజీ ఎంపీటీసీ బన్న స్వరూప, లక్ష్మణ్స్‌ కుటుంబ సభ్యులు, యోగ శిక్షకులు, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కార్యదర్శి బాదే వెంకటేష్‌ పాల్గొన్నారు.