గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు : సౌజన్య

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
గంజాయి రవాణ చేసినా, విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు, శిక్షలు ఉన్నాయని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్‌లో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. రిమ్స్‌ అవతల గంజాయి తీసుకునే వారు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారిపై ఎడీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టులో శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ ఓం ప్రకాష్‌, న్యాయవాది ఉమేష్‌ డోలే, రిమ్స్‌ మెడికోలు, సిబ్బంది పాల్గొన్నారు.