న్యూఢిల్లీ : డిజిటల్ ప్రింటింగ్ సొల్యూషన్స్ సంస్థ ఎప్సన్ తన ప్రచారకర్తగా నటీ రష్మిక మందన్నను నియమించుకుంది. భారత్‌లో ప్రజాదరణ కలిగిన రష్మిక భారత్‌లో తమ ఎప్సన్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపింది. ఎప్సన్ ఎకోట్యాంక్ ప్రింటర్స్ కోసం రూపొందించిన మల్టీ మీడియా క్యాంపెయిన్‌లో ఆమె మొదటిగా కనిపించనున్నారని ఎప్సన్ ఇండియా బ్రాండ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ తుషాద్ తలతి పేర్కొన్నారు.