– అత్యుత్తమ కస్టమర్ ప్రతిఫలాలు జీవిత దశల పరిష్కారాలను బలపరిచేలా పార్ ప్రొడక్ట్ ఆర్ఎన్ఎల్ స్టార్ ఆవిష్కరణ
నవతెలంగాణ ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆర్ధిక సంవత్సరం 24లో పార్టిసిపేటింగ్ పాలసీదారుల కు సంబంధించి మొత్తం రూ.346 కోట్ల బోనస్‌గా ప్రకటించింది. ఆర్ధిక సంవత్సరం 24 లో కింది వాటిని సాధించడం ద్వారా కంపెనీ పటిష్ఠ ఆర్థిక పని తీరును ప్రదర్శించింది:
* విక్రయించిన కొత్త పాలసీల సంఖ్యలో 22% వృద్ధి.
* ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియంలో 10% వృద్ధి
* ఏయూఎంలో 16% వృద్ధి
* 13వ నెల పర్ సిస్టెన్సీ 82.5%
కంపెనీ రూ. 198 కోట్ల మేరకు పన్నుకు ముందు లాభం ప్రకటించింది. ఇది ఆర్ధిక సంవత్సరం 23 కంటే 84% వృద్ధిని సూచిస్తుంది.
మార్చి 31, 2024 నాటికి అన్ని అర్హత కలిగిన పార్టిసిపేటింగ్ పాలసీలు ఈ బోనస్ డిక్లరేషన్ నుండి ప్రయోజనం పొం దాయి. కంపెనీ గత 23 సంవత్సరాలుగా స్థిరంగా బోనస్‌లను ప్రకటిస్తోంది. ఇది పాలసీదారులు క్రమం తప్పకుండా తమ ప్రీమియంలను చెల్లించడానికి, పాలసీ వ్యవధి అంతటా పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ఈక్విటీలలో బాగా వ్యూహాత్మకమైన అసెట్ కేటాయింపులకు పార్టిసిపేటింగ్ ఫండ్ బలమైన పనితీరు కారణమని చెప్పవచ్చు. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇది గణనీయంగా అధిక పనితీరును ప్రదర్శించింది. అంతేగాకుండా, మా ఫ్లాగ్షిప్ యూలిప్ ఈక్విటీ ఫండ్ 3లో కూడా బలమైన పనితీరు కనిబరుస్తోంది. ఇది నిఫ్టీ 50 బెంచ్‌మార్క్ ను అధిగమించి 26.4% రాబడిని అందించింది.
బోనస్ ప్రకటనపై రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈఓ ఆశిష్ వోహ్రా మాట్లాడుతూ, ‘‘సుస్థిరమైన పని తీరు, పటిష్ఠ పెట్టుబడి నిర్వహణ, ఆపరేటింగ్ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా మా వినియోగ దారులకు విలువను సృష్టించడంపై మేం దృష్టి సారించాం. గత కొన్ని సంవత్సరాలుగా, కంపెనీ డిజిటల్ పరివర్తన ద్వారా కస్టమర్ ఆనందం, పంపిణీదారుల సంతృప్తి, ఉద్యోగుల నిమగ్నతపై దృష్టి సారించింది’’ అని అన్నారు. అత్యుత్తమ కస్టమర్ విలువను అందించడంపై దృష్టి సారించి, కంపెనీ ఇటీవల రిలయన్స్ నిప్పన్ లైఫ్ స్మార్ట్ టోటల్ అడ్వాంటేజ్ రిటర్న్ అనే కొత్త పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్ ను ప్రారంభించింది. ఇది రెండో ఆదాయం, పిల్లల విద్య, పదవీ విరమణ లేదా వారసత్వ సంపద సృష్టి వంటి అనేక జీవిత దశ పరిష్కారాలను అందిస్తుంది.