రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’14’. ఈ చిత్రం జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ, ‘అద్భుతమైనటువంటి స్క్రీన్‌ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించడం అభినందనీయం’ అని అన్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా రతన్, పోసాని కష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు.